ప్రముఖ హీరో నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శిని ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం కోర్ట్. రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సుమారు రూ.11 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రీమియర్ షోలతో కలుపుకొని మొదటిరోజు రూ. 8.10 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి వారంలో సుమారు రూ.20 కోట్లు సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా మరో రెండు కోట్లు వచ్చాయని సమాచారం. ప్రియదర్శి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కోర్ట్ నిలిచింది.