కల్కి మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీను ఇప్పటికే ప్రకటించేశారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో దేశ వ్యాప్తంగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నారు. సందీప్ తదుపరి సినిమా ప్రభాస్‌తో అనగానే ఆడియెన్స్ లో అంచానలు భారీగా పెరిగిపోయాయి. అందులోనూ ప్రభాస్ ఈ సినిమాలో తొలిసారి పోలీస్ గెటప్‌లో కనిపించబోతున్నాడని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ తో పాటు మరికొన్ని సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నాడు. ఈ దీపావళి సందర్భంగా స్పిరిట్ టీం మూవీ పనులను ప్రారంభించేసింది. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి దీపావళి కానుకగా మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి స్పిరిట్ సినిమా సంగీత పనులు స్టార్ట్ చేసాడు. అందుకు సంబంధించి స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించనంత వైల్డ్ గా ఈ మూవీలో కనిపిస్తాడని తెలుస్తోంది.