మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. కీర్తి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. కీర్తి సురేష్ పెళ్లి పై గత కొద్ది రోజులుగా ఎన్నో పుకార్లు వస్తున్నాయి. తెలుగు సినిమాలు పక్కన పెట్టిన కీర్తి ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. అయితే కీర్తి కొచ్చికి చెందిన తన ప్రియుడు ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకోనుందని, డిసెంబర్ 11న వీరి పెళ్లి అని టాక్ నడుస్తోంది. ఆంటోని ఒక వ్యాపారవేత్త అని సమాచారం. అయితే కీర్తి పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా గ్రాండ్ గానే అడుగుపెడుతోంది. వరుణ్ ధావన్‌తో కలిసి తెరి రీమేక్ గా హిందీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.