Site icon

డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకుంటున్న‌ట్లు చెప్పిన కీర్తి సురేశ్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నుంది. త‌న చిన్న నాటి స్నేహితుడు, 15 ఏళ్లుగా ప్రేమిస్తున్న వ్య‌క్తితో వివాహ‌బంధంలోకి అడుగుపెట్ట‌నుంది. ఈ మ‌ధ్యే ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం కీర్తి సురేశ్ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి తిరుమ‌ల‌కు వ‌చ్చింది. తన పెళ్లి గురించి తొలిసారి మీడియాతో మాట్లాడింది. వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటున్నాన‌ని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పింది. అలాగే త‌న పెళ్లి ఎక్క‌డ జ‌రుగుతుంద‌న్న ప్ర‌శ్న‌కు గోవాలో చేసుకుంటున్నాన‌ని స‌మాధానం ఇచ్చింది.

Share
Exit mobile version