శ్రియా శరణ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ లోని దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలందరితోనూ శ్రియా నటించింది. ఒకానొక టైంలో టాప్ హీరోయిన్‌గా చెలామణి అయిన శ్రియ తర్వాత బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసింది. టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే విదేశీ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఓ పాప పుట్టిన తర్వాత శ్రియ మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కూడా శ్రియ సినిమాలు, వెబ్ సిరీస్‌లు , ఈవెంట్లతో బిజీబిజీగా గడుపుతోంది. అయితే తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియ ఓ తెలుగు ప్రొడ్యూసర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్‌తో నటించిన ఓ సినిమాకు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేక చెరువులో దూకాడని చెప్పింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్‌కు ఒకానొక టైంలో వరుస ఫ్లాప్‌లు వచ్చాయి. నా అల్లుడు, నరసింహుడు వంటి ఎన్నో సినిమాలు నిరాశపర్చాయి.ఆ టైంలో ఓ ప్రొడ్యూసర్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యంత్నించాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా శ్రియా అసలు విషయం చెప్పేసింది. ఎన్టీఆర్‌తో తాను జెనీలియా కలిసి ఓ పెద్ద సినిమా చేశామని, ఆ మూవీ నిర్మాత హుస్సేన్ సాగర్‌లో దూకేశాడని చెప్పి నవ్వేసింది. ఎన్టీఆర్, జెనీలియా కలిసి ఓ పెద్ద సినిమాని చేశాం.. ఆ నిర్మాత చాలా ఫన్నీ.. చాలా మంచివాడు.. లాస్ట్ డే పేమెంట్లు అడిగేందుకు వెళ్లాం.. కానీ అప్పటికే నిర్మాత హైదరాబాద్‌లోని ఓ లేక్‌లో దూకేశాడు.. అదృష్ట వశాత్తు ఆయనకు ఏం కాలేదు.. అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు దూకి ఆయనను కాపాడారు అంటూ.. ఇలా నాటి విషయాలను చెబుతూ తెగ నవ్వేసింది శ్రియా. అయితే ఆ సినిమా ఏదో నార్త్ వాళ్లకు అర్థం కాకపోయినా తెలుగు వాళ్లకు మాత్రం ఆ సినిమా నా అల్లుడు అని, నిర్మాత భరత్ అని అర్థమైపోయింది.