ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం కన్నప్ప. టాలీవుడ్ టూ బాలీవుడ్ భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, మోహన్‌బాబు తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్ తో పాటు, పలు పాత్రల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇవన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. తాజాగా మూవీ టీం కన్నప్ప టీజర్ రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విడుదల చేసిన నాలుగు గంటల్లోనే మిలియన్ వ్యూస్ దాటింది. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.