మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొండగట్టు పుణ్య క్షేత్రంలో సందడి చేశారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని వరుణ్ నేడు సందర్శించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వరుణ్ తేజ్‌కు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ తెలిపారు. మొదటి సారి హనుమాన్ దీక్ష తీసుకున్నానని, కొండగట్టు ఎంతో పవర్ ఫుల్ అని తెలిసి వచ్చానని, దర్శనం బాగా జరిగిందని వరుణ్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. వరుణ్ డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకున్నా సినిమాకు మాత్రం కాసులు రాలలేదు. కొత్త ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వరుణ్ వెనుదిరిగారు.