టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆమెను కుటుంబసభ్యులు గురువారం ఆస్పత్రికి తరలించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంజనమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అంటూ సదరు పోస్టులపై కామెంట్లు పెట్టారు. అయితే దీనిపై చిరంజీవి వ్యక్తిగత టీం స్పందించింది. ప్రస్తుతం అంజనమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆమెను ఆస్పత్రికి తీసుకెల్లినట్లు వెల్లడించారు.