మారుతి డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘ది రాజా సాబ్’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఆడియెన్స్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అనుకన్నవన్నీ నిజం చేస్తూ మారుతి ప్రభాస్ లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ డార్లింగ్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. యంగ్ లుక్‌లో ప్రభాస్ అందర్నీ ఫిదా చేస్తున్నాడు. నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజాసాబ్ టీం డార్లింగ్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. ప్రభాస్ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించి మొదట విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో హ్యాండ్సమ్‌గా, యంగ్ చాక్లెట్ బోయ్‌లా కనిపించిన ప్రభాస్ ఈ మోషన్ పోస్టర్‌లో డిఫరెంట్‌లో లుక్‌లో ఉన్నాడు. ప్రభాస్ ఇందులో ఓ సింహాసనంపై కూర్చొని, చేతిలో సిగరెట్ పట్టుకొని కనిపించాడు. లుక్ ఓల్డ్ గా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో చివరిలో ‘హారర్ ఇజ్ ది న్యూ హ్యుమర్’ అనే లైన్ జోడించారు.ఈ సినిమా హారర్ నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతోంది. ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తాడనేది స్పష్టంగా అర్థమవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు పాత్రల్లో నటించే సినిమా ఇదే కాబోతోంది. ఈ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.