ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచిన ప్రేమ జంట నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. కాకపోతే వీళ్ల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే దానిపై చాలా గోప్యత పాటిస్తున్నారు. అయితే వీళ్ల పెళ్లి పనులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి కోసం పసుపు దంచుతున్న ఫొటోను కాబోయే పెళ్లి కూతురు శోభితా దూళిపాళ్ల సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అనే క్యాప్షన్ కూడా జత చేసింది. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభితా ధూళిపాళ్ల పెళ్లి కళతో మెరిసిపోతోంది. దీంతో పెళ్లి పనులు ప్రారంభమైనట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పెళ్లి ఎక్కడ చేసుకుంటున్నారు, ఎప్పుడు జరుగుతోంది అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి పెళ్లికి ముందే చెప్తారా లేక సైలెంట్‌గా కుటుంబసభ్యుల మధ్య సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకుంటారా వేచి చూడాలి!