Site icon

నాగ‌చైత‌న్య-శోభితా పెళ్లి డేట్ ఫిక్స్!

ఇటీవ‌ల నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని నాగ‌చైత‌న్య, శోభితా ధూళిపాళ పెళ్లి ఎప్పుడెప్పుడా అని జ‌నం ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. కుటుంబ స‌భ్యుల న‌డుమ గ‌త ఆగ‌స్టు 8న చైత‌న్య, శోభితాలు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇక అప్ప‌టి నుంచి మూవీ ల‌వ‌ర్స్ వీరి పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల శోభితా ధూళిపాళ కొన్ని ఆస‌క్తిక‌ర ఫొటోలు షేర్ చేసింది. ప‌సుపు దంచ‌డంతో మొద‌లైందంటూ కొన్ని ట్రెడిష‌న‌ల్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పెళ్లిపై ఆడియెన్స్ లో ఇంకా ఆస‌క్తి పెరిగింది. ఇటీవ‌ల అక్కినేని నాగేశ్వ‌ర రావు శ‌త జ‌యంతి వేడుక‌ల్లో సైతం శోభిత తుళుక్కుమ‌ని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ క్ర‌మంలో వీరి పెళ్లికి సంబంధించి ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ జోడీ డిసెంబ‌ర్ 4న పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు టాలీవుడ్‌లో టాక్ న‌డుస్తోంది. డిసెంబర్‌ 2న సంగీత్‌, డిసెంబ‌ర్ 3న‌ మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అనంత‌రం డిసెంబర్‌ 10న గ్రాండ్‌ రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Share
Exit mobile version