సినీ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరగనుంది. ఈ పెళ్లి వేడుక గురించి తాజాగా నాగచైతన్య తండ్రి, హీరో నాగార్జున ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. పెళ్లి చాలా సింపుల్‌గా చేయాలని నాగ చైతన్య కోరినట్లు చెప్పారు.ఇది ఏఎన్నార్ శతజయంతి సంవత్సరం అని, అన్నపూర్ణ స్టూడియోస్ నాగచైతన్య- శోభితల పెళ్లికి వేదిక కావడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. చైతన్య పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరాడని, కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నామన్నారు. స్టూడియోలో అందమైన సెట్‌లో వీళ్ల పెళ్లి జరగనుందన్నారు. పెళ్లి పనులు కూడా చై, శోభితాలే చూసుకుంటున్నారని తెలిపారు.శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని కోరారన్నారు.రిసెప్షన్ వివరాలు మాత్రం ఇప్పుడే చెప్పలేనని వెల్లడించారు.