పుష్ప‌-2పై టీడీపీ ఎమ్మెల్యే సెటైరిక‌ల్ ట్వీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం పుష్ప‌-2. ఈ మూవీ డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ టీం దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ న‌గ‌రాల్లో ప్ర‌మోష‌న్లు స్టార్ట్ చేసేసింది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మేనియా నెల‌కొన్న వేళ ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే బైరెడ్డి శ‌బ‌రి అల్లు అర్జున్ గురించి ప్ర‌స్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. మ‌ళ్లీ కొద్ది సేప‌టికే దాన్ని డిలీట్ చేశారు. కానీ అప్ప‌టికే అది స్క్రీన్ షాట్ల రూపంలో వైర‌ల్‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో అల్లు అర్జున్ ఓ వైసీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే శ‌బ‌రి దాన్ని ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ గారు నంద్యాలలో మీరు చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ మా జనాలు ఇంకా మర్చిపోలేదు. నంద్యాలలో మీరు ఎలా అయితే ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించారో అలాగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నాం. నంద్యాల వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా వర్క్ అయింది. కాబట్టి మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అయింది. పుష్ప 2 సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వాలి… అంటూ ఎమ్మెల్యే శ‌బ‌రి వ్యంగంగా ట్వీట్ చేశారు. కానీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని ఎడిట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఏపీ స‌ర్కార్‌ పుష్ప టికెట్ రేట్లు పెంచుతుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. మ‌రో వైపు మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *