బేబి సినిమాతో హిట్ కొట్టిన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య. యూట్యూబ్ నుంచి వెండితెరపైకి అడుగు పెట్టిన వైష్ణవికి ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె నటించిన తాజా చిత్రం జాక్. ఇందులో డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ హీరో. ఈ సినిమా ప్రమోషన్లలో టీం బిజీగా ఉంది. ఈ మధ్య ప్రచారం కోసం భీమవరం వెళ్లారు. ఈ క్రమంలో హీరోయిన్ మాట్లాడుతూ.. భీమవరం అని మర్చిపోయి రాజమండ్రి అనేసింది. అంతే అందరూ నవ్వడం ప్రారంభించారు. తప్పు తెలుసుకున్న హో F**k మర్చిపోయా అంటూ కవర్ చేసింది. అయినా ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.