Site icon

శ్రీశైలంలో నాగ‌చైత‌న్య‌, శోభితా సంద‌డి!

ఇటీవ‌ల పెళ్లి పీట‌లెక్కిన ప్ర‌ముఖ జంట అక్కినేని నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాళ్ల శ్రీశైలంలో సంద‌డి చేశారు. వీరితో నాగ‌చైత‌న్య తండ్రి , హీరో నాగార్జున కూడా ఉన్నారు. పెళ్లి త‌ర్వాత నూతన వధూవరులు మొద‌టి సారిగా ద‌ర్శించుకున్న ఆల‌యం ఇదే. మ‌ల్లికార్జున‌ స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అర్చ‌కులు నూతన దంపతులకు ఆశీర్వచనం అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Share
Exit mobile version