సినిమాలు తక్కువ చేస్తున్నా టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి స్టార్ డమ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరడం లేదు. ఈ కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఓ సినిమాలు చేయగానే తట్టబుట్టా సర్దేస్తున్నారు. కానీ అనుష్క మాత్రం దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలేస్తోంది. ఇప్పటికీ తెలుగు సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరుగా అనుష్క కొనసాగుతోంది. ఏడాది క్రితం వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత అనుష్క మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. అయితే అనుష్క వరుసగా సినిమాలు చేస్తోందని మాత్రం తెలుస్తోంది. అనుష్క వచ్చే ఏడాది మళయాళంలో ఎంట్రీ ఇవ్వబోతోంది. కథనార్ అనే పాన్ ఇండియా మూవీలో స్వీటీ నటిస్తోంది. దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఘాటి అనే మూవీలో చేస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో క్రిష్‌తో వేదం సినిమా చేసిన అనుష్క అందులో సరోజగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీతో ఘాటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 7న అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఘాటీ గ్లింప్స్ విడుదల చేయనున్నారు మేకర్స్. దీంతో అనుష్క ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అనుష్క వచ్చే ఏడాది రెండు సినిమాలతో వెండితెరపై వెలగనుంది. ఇక ఈ రెండు హిట్ అయితే మళ్లీ అనుష్క ఫుల్ బిజీ అయిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.