దేశ వ్యాప్తంగా సాయిప‌ల్ల‌విపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న వాళ్ల‌లో నాచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్లవి ఒక‌రు. ఈ భామ చ‌క్క‌ని క‌థ‌లు ఎంచుకుంటూ త‌న‌కంటూ సెప‌రేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటూ న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు చేస్తూ సాయిప‌ల్ల‌వి స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మ‌రి కొద్ది రోజుల్లో ఈ భామ‌ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వ‌నుంది. ఇదిలా ఉండ‌గా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ఉండే సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ భారీ వివాదంలో చిక్కుకుంది. ఓ అంశంలో ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆమెపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సాయిప‌ల్ల‌వి గతంలో చేసిన ఓ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నాయి.అందులో సాయిప‌ల్ల‌వి… మన దేశపు సైన్యాన్ని పాకిస్తాన్ వారు టెర్రరిస్టులు అనుకుంటారు అని, భారత సైన్యం, పాకిస్తాన్ సైన్యం ఒకటే అంటూ ఆమె కామెంట్ చేసింది. దీంతో సాయిప‌ల్ల‌వి తీరుపై నెటిజన్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే స‌ద‌రు వ్యాఖ్యలు సాయిప‌ల్ల‌వి విరాట‌ప‌ర్వం సినిమా టైంలో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూ లో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ వాళ్లు అవ‌స‌రం లేద‌ని, సాయిప‌ల్ల‌విలాంటి వాళ్లు దేశంలో ఉంటే నాశ‌న‌మ‌ని కొంద‌రు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. త‌క్ష‌ణ‌మే సాయిప‌ల్ల‌వి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పుడెప్పుడో సాయిప‌ల్ల‌వి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఎందుకు వైర‌ల్ అయ్యాయ‌నేది అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌. మ‌రి దీనిపై సాయిప‌ల్ల‌వి స్పందిస్తుందో లేదో వేచి చూడాలి!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *