పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ చిన్న టాలీవుడ్ సినిమాపై ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా “లవ్ రెడ్డి”. ఈ మూవీ టీంపై ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.ఈ సినిమా స్మరన్ రెడ్డి డైరెక్షన్‌లో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందింది. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల18న గ్రాండ్ థియేటర్లలో రిలీజైన ఈ సినిమాపై ప్రభాస్ స్పందించాడు. లవ్ రెడ్డి చిత్రాన్ని ప్రోత్సహిస్తూ ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ఈ మూవీకి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలవడం ఆనందంగా ఉందని ప్రభాస్ పేర్కొన్నాడు. ప్రభాస్ ఇన్ స్టాలో లవ్ రెడ్డి ట్రైలర్ ను షేర్ చేసి ఆ చిత్రానికి అండంగా నిలవాలని తన అభిమానులను కోరాడు.ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ నుంచి తమ సినిమాకు సపోర్ట్ రావడంతో మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.