పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతోంది. అలాగే దేశ వ్యాప్తంగా మూవీ లవర్స్ ప్రభాస్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల కల్కితో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ కల్కి-2 కూడా చేయనున్నారు. అలాగే మరో సూపర్ హిట్ మూవీ సలార్-2 కూడా సిద్ధమవుతోంది. ఇక మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ దాదాపు పూర్తి కావొచ్చింది. హను రాఘవపూడి సినిమాకు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించేశారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ మూవీ పనులు ఇటీవల మొదలయ్యాయి. హనుమాన్‌తో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ సినిమాకు కూడా ప్రభాస్ సైన్ చేశాడు. ఇక ఇవన్నీ ఇలా ఉండగానే ఫ్యాన్స్ కు ప్రభాస్ నుంచి మరో గుడ్ న్యూస్ అందింది. తాజాగా ప్రభాస్ మరో సినిమాకు ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రభాస్‌కు ఓ మంచి స్టోరీ లైన్ వినిపించాడని సమాచారం. కథ నచ్చడంతో ప్రభాస్ వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ మూవీ వచ్చే ఏడాది షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. ఇలా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.