సినిమా టికెట్ల‌కు ఆమాత్రం ఖ‌ర్చు పెట్ట‌లేరా

పెరుగుతున్న‌ సినిమా టికెట్ల రేట్లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక పెద్ద హీరోల సినిమా రిలీజైతే టికెట్ల రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. దీంతో ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం సినిమా చూడ‌టం క‌ష్టంగానే మారింద‌ని చెప్పుకోవ‌చ్చు. టికెట్ల ధ‌ర‌ల‌తో పాటు థియేట‌ర్ లోప‌ల తినుబండారాల ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని తాకేలా ఉంటున్నాయి. చెప్పాలంటే చిన్న చిత‌కా ప‌నులు చేసుకునే వాళ్లు కుటుంబాల‌తో సినిమాల‌కు వెళ్ల‌డం ఎప్పుడో మానేశారు. అయితే ఈ టెకెట్ల రేట్ల పెంపుపై నిర్మాత నాగవంశీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టికెట్ల రేట్లు ఏమంత పెరుగుతున్నాయ‌ని, ఆమాత్రం భ‌రించ‌లేరా అని ప్రేక్ష‌కుల‌పైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక ఫ్యామిలీలో నలుగురు కలిసి సినిమాకు వెళ్తే.. టికెట్ కి రూ.250 చొప్పున‌ రూ.1000 ఖర్చ‌యినా, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ మ‌రో రూ.500 అనుకున్నా 1500 అవుతుంద‌ని, రూ.1500కు మూడు గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ దొరుకుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఇంత త‌క్కువ డ‌బ్బుకే జ‌నాల‌ను మూడు గంటలు కూర్చోబెట్టి వినోదాన్ని అందించే ప్లేస్ ఇంకా ఏముంద‌ని ప్ర‌శ్నించారు. నిర్మాణ ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్లే టికెట్ల రేట్లు పెంచిన‌ట్లు చెప్పారు. సినిమా పై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నందుకే ప్రభుత్వాన్ని అడిగి రేట్లు పెంచుకుంటామని అనుమ‌తులు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. దీని వ‌ల్ల జ‌నాల‌కు ఏం అన్యాయం జ‌రుగుతుంద‌ని మండిప‌డ్డారు. ఒక్క ఫ్యామిలీ నెలకు రెండు సినిమాలు చూస్తారు.. ఎవరూ ఇర‌వై సినిమాలు చూడటం లేదు కదా అని నాగవంశీ ఫైర్ అయ్యారు. కాగా, నాగ‌వంశీ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇక నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *