రిలీజ్ డేట్ మార్చుకున్న స‌త్య‌దేవ్‌ జీబ్రా!

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి సినిమాల‌తో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌త్య‌దేవ్ హీరోగా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. సత్య దేవ్ కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో వ‌స్తున్న ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్‌.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవ ప్ర‌మోష‌న్ల‌ను టీం మొద‌లెట్టేసింది.ఈ క్ర‌మంలో నేడు ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఉద్దేశించిన మోషన్ పోస్టర్‌ను మేక‌ర్స్ విడుదల చేసారు. ఈ సినిమాను అక్టోబర్ 31న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కార‌ణాలేంటో కానీ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న జీబ్రాను నవంబర్‌ 22న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్ర‌క‌టించింది. విభిన్న క‌థాంశంతో వ‌స్తున్న ఈ సినిమా స‌త్య‌దేవ్‌కు పాన్ ఇండియా స్టార్ డ‌మ్ తీసుకొస్తుందో లేదో వేచి చూడాలి!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *