బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. బాలయ్య లెజెండ్ సినిమాతో తెలుగులో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పాటు రక్తచరిత్ర ఆమెకు మరో బ్లాక్ బాస్టర్ హిట్ అందించింది. కానీ తెలుగులో ఈ భామకు ఎందుకో అంతగా ఆఫర్లు రాలేదు. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక బేబీ బంప్ ఫోటోతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్‌నైట్’ లండన్‌లో ప్రీమియర్ షో జరుగుతుండగా రాధికా ఆప్టే కూడా పాల్గొంది. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కేన్స్‌లో ప్రదర్శించారు. 2024 కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న రాధికా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాధికా 2012లో బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకుంది. నవంబర్‌లో ఆమె డెలివరీ కానున్నట్లు సమాచారం.