పుష్ప హిట్ తో డైరెక్టర్ సుకుమార్ జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు సుకుమార్ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడనే దానిపైనే అందరి దృష్టి పడింది. సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకిక్కంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రాంచరణ్ సరసన ఈ సినిమాలో పుష్ప భామ రష్మిక మందన్న నటించనుందట. గతంలో ఆచార్య సినిమాలోనే రష్మికకు రాంచరణ్‌తో నటించే ఛాన్స్ వచ్చిందటక కానీ ఆ సమయంలో పుష్ప సినిమా షూటింగ్‌లో ఉండటంతో డేట్స్ కుదరక ఒప్పుకోలేదట. ఇప్పుడు మళ్లీ అవకాశం రావడంతో రష్మిక ఓకే చెప్పేసినట్లు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.