Site icon

గ్లామర్​ డోస్​ పెంచిన శాలినీ పాండే

శాలిని పాండే.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తోనే కాకుండా తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ క్యూట్ హీరోయిన్, అప్పటి నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత అదే స్థాయిలో సక్సెస్ పొందలేకపోయింది. ఇప్పటి వరకు పదిహేనుకు పైగా సినిమాలు చేసినా, శాలిని పాండేకు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరే అవకాశాలు మాత్రం ఇంకా రావడం లేదు. అయినా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటో షూట్లతో నిత్యం అభిమానులకు కనువిందు చేస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెరుగుతున్న ఫాలోవర్స్ తో పాటు, తన గ్లామర్ డోస్ ను కూడా పెంచుకుంటూ, ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పొందుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫోటోలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టైలిష్ లుక్​ లో, కనిపించీ కనిపించని అందాలతో అట్రాక్ట్ చేస్తోందీ భామ. ప్రస్తుతం శాలినీ తమిళంతో పాటు బాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలతో బిజీగా గడుపుతోంది. శాలినీకి తెలుగులో మంచి అవకాశాలు వస్తే సిల్వర్ స్రీన్​ పై మళ్లీ చూడొచ్చిన ఆమె ఫ్యాన్స్ వెయిట్​ చేస్తున్నారు.

Share
Exit mobile version