Site icon

ప్ర‌భాస్‌తో పోటీకి దిగిన డీజే టిల్లు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్‌, స‌లార్ 2, స్పిరిట్‌, క‌ల్కి2 సినిమాల్లో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది వీటిలో ముందుగా ది రాజా సాబ్ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తయిన‌ట్లు స‌మాచారం. మారుతి దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమా హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. 2025 ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నారు. అయితే ప్ర‌భాస్ కు పోటీగా మ‌రో యంగ్ హీరో వస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్‌ సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో సిద్ధు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జాక్‌’ విడుదల తేదీని ప్రకటించారు. 2025 ఏప్రిల్‌ 10న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 2025 ఏప్రిల్‌ 10న ప్రభాస్ సినిమా వ‌స్తున్నా సిద్దు మూవీ అదే రోజు విడుద‌ల చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా ఉంది. మ‌రి ఎవ‌రు త‌మ సినిమాను వాయిదా వేసుకుంటారో చూడాలి.

Share
Exit mobile version