Site icon

క‌లెక్ష‌న్ల‌లో రికార్డు సృష్టిస్తున్న అమ‌ర‌న్‌

త‌మిళ హీరో శివ కార్తికేయన్- సాయిప‌ల్ల‌వి జంట‌గా నటించిన చిత్రం అమరన్. అక్టోబ‌ర్ 31న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాల్లో అమరన్ టాప్‌లో నిలిచింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. ఇక‌ ఈ సినిమా శివకార్తికేయన్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. రికార్డుల ప‌రంగా ఈ సినిమా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయాన్ సినిమాను వెనకు నెట్టింది. వేట్ట‌యాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.180 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా అమరన్ ఆ కలెక్షన్ల‌ను కేవలం పదిహేను రోజుల్లో దాటేసింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ మ‌రో తమిళ హీరో విజయ్ సినిమాను సైతం అధిగమించింది. బుకింగ్స్ విజ‌య్ సినిమా గోట్‌ను ఈ మూవీ వెన‌క్కి నెట్టింది. బుక్ మై షో లో బుకింగ్స్ పరంగా గోట్‌ 4.5 మిలియన్ టికెట్స్ సేల్స్ తో టాప్ వ‌న్‌లో నిలవగా, అమరన్ ఇప్పటి వరకు 4.52 మిలియన్ టికెట్స్ బుకింగ్స్ తో గోట్ రికార్డును బద్దలు కొట్టింది. రిలీజై ఇర‌వై రోజులు దాటుతున్నా ఇంకా ఈ మూవీ స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Share
Exit mobile version