దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాహుబలి హిట్ తర్వాత బాలీవుడ్ భామలు సైతం తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే దీపికా పడుకోన్, ఆలియా భట్, జాన్వీ కపూర్‌లు తెలుగులో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఇక తాజాగా సోనాక్షిసిన్హా తెలుగులో హిట్ కొట్టాలని తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యంగ్ హీరో సుధీర్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్ జటాధరలో సోనాక్షి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు వెంకట్ కళ్యాణ్ ఆమెను కలిసి, కథ వినిపించాడని టాక్ నడుస్తోంది. సోనాక్షి ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పిందని, త్వరలో షూటింగ్ లో పాల్గొంటుందని చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.