బాలీవుడ్ ఐటెం బాంబ్, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అందరికీ సుపరిచితమే.. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో సన్నీ నటించింది. కానీ తనకు పోర్న్ స్టార్ గా వచ్చినంత గుర్తింపు సినిమాల్లో రాలేదనే చెప్పాలి. అయినా తన క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. అయితే ఈ క్రమంలో మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఇంతకు ముందు వరకు గ్లామర్ పాత్రల్లో వచ్చిన సన్నీ విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మిస్తున్న మందిర మూవీతో వస్తోంది. ఈ మూవీకి ఆర్ యువన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నవంబర్ 22న మందిర థియేటర్లలో సందడి చేయనుంది. సన్నీ లియోన్ ఈ మూవీలో యువరాణిగా నటించింది. మరి ఈ చిత్రానికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి!