సరికొత్త కథలు ఎంచుకుంటూ సూపర్ హిట్లు కొడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. తన తాజా చిత్రం హనుమాన్ సినిమాకు ఈ అవార్డు వరించింది. హనుమాన్ చిన్న సినిమాగా విడుదలై దేశ వ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తేజ సజ్జాకు ఆల్ ఇండియా వైడ్ గుర్తింపు తీసుకొచ్చింది. కాగా, ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హనుమాన్ సినిమాకు తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. హనుమాన్ సినిమాలోని తేజ అద్భుతమైన నటన ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. అందులోని వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయి. తేజ సజ్జా ముందుగా బాలనటుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి సినిమాకే నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఇక పెద్దయ్యాక టాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీలతో అదరగొడుతున్నాడు. తేజ నటించిన ఓ బేబీ, జాంబిరెడ్డి, హనుమాన్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక హనుమాన్ ఒకడుగు ముందుకేసి నేషనల్ లెవెల్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు ఇప్పటికే తేజ ఒక అవార్డు అందుకోగా, ఇది రెండోది. గత సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా రూ.330 కోట్లు వసూళ్ల ను రాబట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమాకు ఇంకా ఎన్ని అవార్డులు వస్తాయో వేచి చూడాలి.