హైదరాబాద్‌లో షో నిర్వహించాలనుకున్న ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్‌కు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ షో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారం పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం లైవ్ షో సమయంలో లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, ఫ్లాష్ లైట్లు ఉంటాయి కాబట్టి వారిని స్టేజ్ ఎక్కించవద్దని కోరింది. అలాగే మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించేటువంటి పాటలను వేదికపై పాడకూడదని హెచ్చరించింది. నోటీసులో, దిల్జిత్ పాత షోలలో మద్యం , మాదకద్రవ్యాలను ప్రోత్సహించే పాటలు పాడిన వీడియోలకు ఆధారాలుగా ఇచ్చి వాటిని రిపీట్ చేయవద్దని హెచ్చరించింది.