సినీ ఇండస్ట్రీలో వ్యక్తుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కెరియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. సినీ ప్రముఖుల వ్యక్తి గత జీవితాలు కూడా సామాన్యుల కంటే భిన్నంగానే ఉంటాయి. ఎప్పుడు పెళ్లిళ్లు అవుతాయో, ఎప్పుడు విడాకులు తీసుకుంటారో.. ఎవరు ఎవరితో సీక్రెట్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారో చెప్పలేం. ఏ వయసులో అయినా సరే పెళ్లిళ్లు చేసేసుకుంటారు. ఇటీవల నటుడు నరేశ్ , సహాయనటి పవిత్రను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. ఇప్పుడు మరో నటుడు నేడు లేటు వయసులో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. `నువ్వే కావాలి` సినిమాలో తరుణ్ తో కలిసి నటించిన సాయి కిరణ్(46) రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. సాయి కిరణ్ తెలుగుతో పాటు మళయాళంలో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అలాగే పలు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సాయి కిరణ్ సీరియల్ నటి స్రవంతిని పెళ్లాడనున్నాడు. సాయికిరణ్ కు గతంలోనే పెళ్లి అయ్యింది. మొదటి భార్య వైష్ణవితో ఇప్పటికే విడాకులు తీసుకున్నారు.వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. తాజాగా స్రవంతితో ఆయన కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు