అనుష్క ఘాటీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌!

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ జేజ‌మ్మ అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం ఘాటీ. వేదం లాంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. నాలుగు రోజుల క్రిత‌మే మూవీ టీం అనుష్క పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. నేడు అనుష్క బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో అనుష్క లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. చేతిలో ఓ సిగార్ ప‌ట్టుకొని ర‌క్తంతో త‌డిచిన చెయ్యి, క‌ళ్ల‌ల్లో ఆక్రోషంతో ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్ క‌లిగిస్తోంది. దీనికి విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్ జ‌త చేశారు. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *