Site icon

రామాయ‌ణ సినిమాపై కీల‌క అప్‌డేట్ !

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సౌత్ ఇండియ‌న్ టాప్ హీరోయిన్‌ సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రామాయణ’. బాలీవుడ్‌ డైరెక్టర్ నితేశ్‌ తివారీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప‌లువురు బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి టాలీవుడ్ టాప్‌ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. సీతారాములుగా ర‌ణ‌బీర్‌, సాయిప‌ల్ల‌వి పేర్లు విన‌గానే ఫ్యాన్స్ ఖుష్ అయిపోయారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు. అయితే దీని గురించి ఏమాత్రం బ‌య‌ట‌కు రివీల్ చేయ‌కుండా టీం సీక్రెట్‌గా షూటింగ్ చేసేస్తోంది. అయితే అభిమానులు ఒకానొక స‌మ‌యంలో అసలు ఈ మూవీ ఉందా లేక‌ ప‌క్క‌న పెట్టేశారా అనే అనుమానాలు కూడా వ్య‌క్తం చేశారు. ఇలాంటి త‌రుణంలో మూవీ టీం ఓ కీల‌క అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. రామాయ‌ణ రెండు పార్టులుగా రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పాటు మూవీ విడుద‌ల చేసే తేదీల‌ను కూడా తెలుపుతూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానుంది.ఇక ఈ మూవీలో న‌టిస్తున్న వాళ్లంద‌రూ పెద్ద స్టార్లే. రావ‌ణుడిగా కేజీఎఫ్ స్టార్‌ యశ్ న‌టిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపిస్తార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి మూవీ టీం అప్పుడ‌ప్పుడు ఇలా అప్ డేట్స్ ఏమైనా ఇస్తారా లేదా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తారో తెలియాల్సి ఉంది.

Share
Exit mobile version