పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ రాజాసాబ్. ఈ సినిమాలో ప్రభాస్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ , మాలవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్స్ ఇప్పటికే విడుదల చేశారు. ఇవి సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతోంది. రానున్న సెప్టెంబరులో రాజా సాబ్ రిలీజ్ అవనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.