దుల్క‌ర్ స‌ల్మాన్ కోసం త్రివిక్ర‌మ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

ప్ర‌ముఖ‌ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ నుంచి తాజాగా విడుద‌ల‌కు సిద్ధ‌మైన మూవీ ల‌క్కీ భాస్క‌ర్‌. మ‌హాన‌టితో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన దుల్క‌ర్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ల‌క్కీ భాస్క‌ర్ తో మ‌రోసారి దుల్క‌ర్ త‌న ల‌క్ ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. దీపావ‌ళి కానుక‌గా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ర‌న‌ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా న‌టించింది. వెంకీ అట్లూరి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదే ఊపులో మూవీ ప్రీరిలీజ్ వేడుక‌కు ప్లాన్ చేశారు మేక‌ర్స్.. ఈ ఈవెంట్ అక్టోబర్ 27న చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి స్టార్ డైరెక్ట‌ర్‌ త్రివిక్రమ్ తో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా వస్తున్నట్టుగా మూవీ టీం రివీల్ చేసింది. దీంతో ఈ ఈవెంట్ ఆడియెన్స్ లో హైప్ పెంచేసింది. ఈ మూవీ ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *