Site icon

గురుకులంలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

సంగారెడ్డి మండలం కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. గురుకుల పాఠ‌శాల‌లో లింగంప‌ల్లికి చెందిన‌ స్వాతి అనే విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇవాళ ఉదయం గదిలో నుంచి స్వాతి ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గురుకుల సిబ్బందికి స‌మాచారం అందించారు. సిబ్బంది వచ్చి చూడగా స్వాతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. పోలీసులకు, స్వాతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్వాతి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్వాతి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారని ఆరోపించారు. పాఠ‌శాల వ‌ద్ద‌ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని విరమించాలని కోరారు. ఈ ఘటనపై సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ.. ఘటన సమయంలో హాస్టల్ వార్డెన్ లేదనే విషయం విద్యార్థులు చెబుతున్నారన్నారు. కేసు నమోదు చేశామని, విద్యార్థిని కొంచెం డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు.

Share
Exit mobile version