Site icon

బిగ్‌బాస్ ఫేమ్‌ గంగ‌వ్వ‌పై కేసు న‌మోదు !

A case has been registered against Gangavva of Bigg Boss fame!

A case has been registered against Gangavva of Bigg Boss fame!

బిగ్ బాస్ ఫేమ్‌, యూట్యూబ్ న‌టి గంగ‌వ్వ‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. గంగ‌వ్వ త‌మ యూట్యూబ్ చానెల్‌లో రామ‌చిలుక‌ను వాడారంటూ జ‌గిత్యాల‌కు చెందిన జంతు సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త గౌత‌మ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గంగ‌వ్వ‌తో పాటు , మ‌రో న‌టుడు రాజుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కాగా, 2022వ సంవ‌త్స‌రంలో మే 20న మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్‌లో గంగ‌వ్వతో పాటు రాజు అనే వ్య‌క్తి జ్యోతిష్యం వీడియో అప్‌లోడ్ చేశారు. దీనిలో వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ చ‌ట్టం ఉల్లంఘించార‌ని, వినోదం కోసం ప‌క్షుల‌ను వినియోగించార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు గంగ‌వ్వ‌తో పాటు, న‌టుడు రాజుకు నోటీసులు పంపిన‌ట్లు స‌మాచారం.

Share
Exit mobile version