ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ యువతిని సినిమాకు తీసుకెళ్తానని చెప్పిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కార్వేటి నగరం మండలం కత్తెరపల్లి గ్రామానికి చెందిన యువతిని ఓ యువకుడు సినిమాకు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లాడు. తమిళనాడులోని పల్లిపట్టుకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ పొలంలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. యువతి తండ్రి కార్వేటినగరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.