మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం.. న‌టుడిపై కేసు

టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. శ్రీ తేజ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు శ్రీ తేజ్‌పై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 69, 115(2), 318(2) సెక్షన్‌ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. శ్రీ తేజ్‌పై గ‌తంలో సైతం కూకట్‌పల్లి పీఎస్‌లో ఓ ఫిర్యాదు ఉంది. ఓ బ్యాంకు మేనేజ‌ర్ అయిన వ్య‌క్తి భార్య‌తో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం తెలిసి ఆమె భ‌ర్త‌ గుండెపోటుతో మరణించారు. అనంత‌రం ఆమె శ్రీతేజ్‌ను పెళ్లి చేసుకోమ‌ని కోర‌గా ఆయ‌న నిరాక‌రించాడు. దీంతో యువ‌తి శ్రీ తేజ్‌పై కేసు నమోదు చేసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *