రాష్ట్రంలో పుష్ప సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలైనప్పటికీ ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం , మంత్రులు అల్లు అర్జున్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో నేతగా ఉన్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన నేడు గాంధీభవన్ కు వెళ్లారు. ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీని కలిసి మాట్లాడేందుకు చంద్రశేఖర్ ప్రయత్నించారు. అయితే ఆమె చంద్రశేఖర్‌తో మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో వెంటనే చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ నుంచి బయటకు వెళ్లిపోయారు.