Site icon

మోహ‌న్ బాబుకు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

ఇటీవ‌ల కుటుంబ త‌గాదాల‌తో వార్త‌ల్లోకెక్కిన న‌టుడు మంచు మోహ‌న్ బాబు కుటుంబంలో క‌ల్లోలం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో నేడు ఉద‌యం మోహ‌న్ బాబు అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. ఆయ‌న‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మోహ‌న్‌బాబుకు ర‌క్త పోటు ఎక్కువైన‌ట్లు స‌మాచారం. మోహన్‌బాబు ఆరోగ్యంపై వైద్యులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయ‌న‌కు బీపీ పెరగడంతో పాటు.. కంటి కింద, కాలికి చిన్న చిన్న గాయాలైనట్లు చెప్పారు. ఆయ‌న‌పై న‌మోదైన కేసులో మోహ‌న్ బాబు రాచకొండ సీపీ యెదుట హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.

మోహ‌న్ బాబుపై కేసు న‌మోదు…

త‌మ కుటుంబ వ్య‌వ‌హారాల‌పై ప్ర‌శ్నించిన మీడియాపై మోహ‌న్ బాబు దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. మైక్ ప‌ట్టుకొని బూతుల‌తో మీడియా వ్య‌క్తుల‌పై విరుచుకుప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. మీడియా పై దాడి కేసులో మోహన్ బాబు పై కేసు నమోదైంది. మీడియాకు సంబంధించిన వ్య‌క్తుల ఫిర్యాదు మేర‌కు 118 BNS సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Share
Exit mobile version