ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినేట్లో సమీకృత పర్యాటక పాలసీ 2024-29 కి ఆమోదం లభించింది. స్పోర్ట్స్ పాలసీలో పలు మార్పులకు ఆమోదం తెలిపారు. సీఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు, ఏపీ టెక్ట్స్‌టైల్, ఏపీ మారిటం, డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మారణ దినోత్సవం నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకానికి, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీకి ఆమోదం తెలుపుతూ, గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో చర్చించారు. పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.