ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు , మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం నారావారి పల్లెలో నిర్వహించిన రామ్మూర్తి కర్మ క్రియలకు ఆయన సోదరుడు, సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి హాజరయ్యారు. రామ్మూర్తినాయుడు కుమారుడు, సినీనటుడు నారా రోహిత్ కర్మక్రియలు నిర్వహించారు. వీరితో పాటు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, పలువురు టీడీపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.