Site icon

వైయ‌స్ జ‌గ‌న్‌పై ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైయ‌స్ ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నేడు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ష‌ర్మిల మాట్లాడారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌ముఖ‌ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తు వెల్లడైందని షర్మిల ఆరోపించారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్‌ రాష్ట్రం పరువు తీశారని విమ‌ర్శించారు. ఇటీవ‌ల‌ అమెరికా ఏజెన్సీలు గౌతమ్‌ అదానీతో పాటు మరికొందరిపై అభియోగాలు చేశాయ‌ని, భారత్‌లో అదానీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నార‌ని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్లు తెలిపాయ‌న్నారు. రూ.2,100 కోట్లు చెల్లించినట్లు అమెరికా దర్యాప్తు ఏజెన్సీ తేల్చింద‌ని ఆరోపించారు. రూ.1,750 కోట్లు జగన్‌కు లంచం ఇచ్చినట్లు స్పష్టంగా వెల్లడైంద‌న్నారు. ఆధారాలు ఉన్నందున కేసులు పెట్టినట్లు ఆ ఏజెన్సీలు పేర్కొన్నాయ‌ని, గౌతమ్‌ అదానీపై విచారణ జరిపితే ఈ విషయం బయటకు వచ్చింద‌ని తెలిపారు.

Share
Exit mobile version