కాకినాడ పోర్టులో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌నిఖీలు

కాకినాడలోని యాంకరేజ్‌ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. పోర్టు నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త వైసీపీ పాల‌న నుంచే కాకినాడ పోర్టు నుంచి భారీ ఎత్తున బియ్యం అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రి నాదెండ్ల సైతం పోర్టును సంద‌ర్శించి దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నేరుగా పోర్టుకు రావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ… ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేకానీ చర్యలు చేపట్టరా అని అధికారుల‌ను నిలదీశారు. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై పట్టబడిన నౌకలో 640 టన్నుల బియ్యాన్ని పవన్‌ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్‌లో బియ్యాన్ని‌ పరిశీలించారు. బియ్యం అక్ర‌మ ర‌వాణా వెనుక ఉన్న వారిపై త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *