ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహాయుతి కూటమి తరపున బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో మొదట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతం అన్నారు. బాలా సాహెబ్ ఠాక్రే నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయన్నారు. శివసేన-జనసేన అన్యాయంపై పోరాడతాయని, ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్‌ను బాలాసాహెబ్ కోరుకున్నారని గుర్తు చేశారు.