ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్‌లో పవన్ చిన్న కుమారుడు చదువుకుంటున్న పాఠశాలలో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ పవనోవిచ్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ నేడు సింగపూర్ బయలుదేరనున్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు సమాచారం. ప్రస్తుతం అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ సింగపూర్ బయలుదేరనున్నారు.