డిప్యూటీ సీఎం ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై డీజీపీ షాకింగ్ రెస్పాన్స్

హోం మినిస్ట‌ర్, పోలీస్ డిపార్ట్ మెంట్‌పై ఇటీవల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాన్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. తాను హోం మంత్రి అయితే ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఇక ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు హోం మంత్రి అనిత రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు నేడు డిప్యూటీ సీఎం వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. డీజీపీ నేడు అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణే త‌మ‌ విధానం అని స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామ‌ని, రాజకీయ ఒత్తిళ్లతో పని చేయబోమని వెల్ల‌డించారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మాట్లాడ‌డానికి నిరాక‌రించారు. గ‌తంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జ‌రిగితే నేరస్తుల‌ను ప‌ట్టుకునేందుకు ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీ వాడ‌క‌పోగా, భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ అని వ‌దిలేశార‌ని చెప్పారు. మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతుందన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *