రాష్ట్రంలో ధరల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్లు, ధరల నియంత్రణ కోసం మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. కమిటీలో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు.ఈ కమిటీ నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకస్మికంగా ఎందుకు పెరుగుతున్నాయన్న అంశంపై అధ్యయనం చేయనుంది. అలాగే ధరల తగ్గింపుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.