కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల సీఎం చంద్రబాబు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ దీపం పథకంలో భాగంగా ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి గ్యాస్ వియోగదారురాలికి రూ.851 రాయితీ అందుతుంది. నాలుగు నెలలకొక సిలిండర్ చొప్పున ఏటా మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయనుంది సర్కార్. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లో గ్యాస్ లబ్ధిదారులకు అందుతుంది. దీనికి సంబంధించిన నగదు చెల్లించిన 48 గంటల్లో డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.